‘బంగార్రాజు’ సినిమా చేసేట‌ప్పుడు ఒత్తిడి అనిపించ‌లేదు: కృతి శెట్టి

krithishetty Interview

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. ఈ సంద‌ర్భంగా నాయిక కృతిశెట్టి చిత్రంగురించి ప‌లు విష‌యాల‌ను ఇలా తెలియ‌జేస్తున్నారు. – బంగార్రాజు క‌థ విన్న‌ప్పుడే ఇలాంటివారు కూడా వుంటారా. ఇంత కాన్‌ఫిడెంట్‌గా మ‌నుషులు వుంటారా! అనిపించింది. అందుకే నా కేరెక్ట‌ర్ విన‌గానే న‌వ్వేశాను. దాన్ని వెండితెర‌పై చూసి ప్రేక్ష‌కులు అదే ఫీల‌వుతార‌ని అనుకుంటున్నా. క‌నుక‌నే నేను ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నా. – నా పాత్ర ఫ‌న్ ప‌టాకాలా వుంటుంది. ఓ గ్రామ స‌ర్పంచ్‌గా చేశాను. స‌ర్పంచ్ అంటే స్పీచ్‌లు ఇవ్వాలి. నాకు అది…