మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ప్రస్తుతం రవితేజ, అప్సరా రాణిలపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కు జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు ‘క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…