‘కథ వెనుక కథ’ టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల

kathavenukakatha tittle first look launch

విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్స్‌ ప్రొడక్ష‌న్ నెం.1గా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’.కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ని గురువారం ప్రసాద్ ల్యాబ్య్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా… నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. మీడియా ఈ చిత్రాన్ని చూసి సహకరించాలి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు. చిత్రానికి పని చేసిన అందరికీ థాంక్స్. అలీ, సుమన్ ఇలా అందరూ చక్కగా నటించారు.…