‘కళింగపట్నం జీవా’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

kalingapatna Movie

రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మళ్లీ రావా’ చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ‘లక్ష్య’ మూవీ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఒక నిర్మాతగా సినిమా నిర్మాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది, తనే కథ రాసుకుని.. హీరోగా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం…