(కైకాల సత్యనారాయణ 1935-2022) తెలుగు చిత్రసీమ వరుసగా మహామహులైన నటదిగ్గజాలను కోల్పోతూ తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకం వీడిన క్షణాలను మరచిపోకముందే నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ‘నేను సైతం వెళ్ళిపోతున్నాను’ అంటూ శాశ్వతంగా పరిశ్రమకు వీడ్కోలు చెబుతూ ఇక సెలవంటూ మనల్ని విడిచి వెళ్లిపోయారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో…
Tag: kaikala sathyanarayana no more
కైకాల సత్యనారాయణ : విలక్షణ నటనకు నిలువెత్తు నిదర్శనం
పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు జీవం పోసిన నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరంటేనే చిత్రసీమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో నేడు (23 డిసెంబర్-2022) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్రసీమ మరో సీనియర్ నటుడిని కోల్పోయినట్లయింది. 1935 జులై 25న జన్మించిన సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు,…