హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం ‘సర్దార్’ బ్రిలియంట్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిర్మాతలు తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. కార్తిని మారువేషంలో సర్దార్‌గా, పబ్లిసిటీ క్రేజ్ వున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సైనిక సమాచారాన్ని ఉన్న ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అవుతుంది. రా (RAW) సిబిఐతో సహా ప్రతి ఒక్కరూ దాని కోసమే వెదుకుతుంటారు. చివరిగా అది ఎవరికీ చిక్కింది, అందులో వున్న రహస్యాలు ఏమిటనేది ఇందులో కధాంశంగా ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. పిఎస్ మిత్రన్ అద్భుత కథనం, డివోపీ జార్జ్ సి విలియమ్స్ బ్రిలియంట్ విజువల్స్, జివి ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ లైవ్ స్కోర్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తి పాత్ర, అభినయం…