రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరు బయటికొచ్చినా ఎక్కువ వినిపించిన పేరు మాత్రం అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌దే. రామ్‌చరణ్‌తో జాన్వీ జోడీ కట్టనుందనే వార్త చాలారోజులుగా హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది. ‘ఆర్‌సీ16’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించనుంది. ఈ విషయాన్ని తన తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జాన్వీకపూర్ చరణ్‌తో నటించనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది’ అని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ…