(విడుదల : సెప్టెంబర్ 7, 2023, రేటింగ్ : 4.5/5, నటీనటులు: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె (ప్రత్యేక పాత్ర) ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య, సంజయ్ దత్ (అతిధి పాత్ర) తదితరులు). దర్శకత్వం : అట్లీ, నిర్మాతలు: గౌరీ ఖాన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు, సహ నిర్మాత : గౌరవ్ వర్మ, ఎడిటర్: రూబెన్) ‘పఠాన్’తో షారుఖ్ ఖాన్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్; తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గురైన మహిళా ఖైదీలకు గైడ్ గా, మెంటర్ గా…