మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పోస్టర్‌లో మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా ధరించి ఆమె స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మెడలో లేయర్డ్ నెక్లెస్‌లు, చేతికి బ్రేస్‌లెట్, ఎరుపు రంగు రౌండ్ సన్‌గ్లాసెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను…
