శ్రీదేవి తనయ జాన్వీకపూర్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది. ‘ధడక్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సౌత్ సినిమాల మీద తన ఆసక్తిని చూపించిన జాన్వీకపూర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘దేవర’తో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘దేవర’ సినిమా పాన్ ఇండియా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది జాన్వీ. సీనియర్ ఎన్.టి.ఆర్, శ్రీదేవి తరహాలో తారక్, జాన్వీల కాంబో పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కెరీర్ పై ఎంతో సంతృప్తిగా ఉన్న జాన్వీ తాజా ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. అంతేకాదు…