జాన్వీ కపూర్‌ : ‘పెద్ది’పై ఆశలెన్నో..!

Janhvi Kapoor: Lots of hope for 'Peddhi'!

స్టార్ కిడ్స్‌లో బెస్ట్ లుక్‌, చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ జాన్వీకి సరైన హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో 2018లో ‘ధడక్‌తో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌. మొదట్నుంచీ శ్రీదేవి కూతురు కాబట్టి ఈమెకు బాలీవుడ్‌లో అదనపు ఇమేజ్ ఉంది. మొదటి సినిమా నుంచే అందరి దృష్టి ఆమెపై పడింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలీ, భవాల్ లాంటి సినిమాలతో పెర్ఫార్మెన్స్ పరంగా ఎదిగినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితం లేకుండా పోయింది. స్టార్ ఇమేజ్ ఉన్నా సరైన స్టోరీ సెన్స్ లేకపోవడం.. ఎంచుకున్న సినిమాలు ప్రజల మైండ్‌సెట్‌కు కలిసిరాకపోవడం లాంటివి ఆమె కెరీర్‌ను ఎదగకుండా ఆపేసాయి. అయితే 2024 చివర్లో తెలుగులో అడుగు పెట్టిన జాన్వీకి ఇక్కడ అదృష్టం కలిసొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవర బ్లాక్‌బస్టర్…