హీరోల మేనరిజాన్ని మార్చాలన్నా, వెండితెరపై మాస్ డైలాగులతో మంటలు పుట్టించాలన్నా టాలీవుడ్ డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్ కే సాధ్యం. అతి తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే డైరెక్టర్‌గా ఆయన పేరుగాంచారు. ఆయనలాంటి సీన్స్, డైలాగులు రాసే దర్శకుడు ఇండియాలోనే లేరు అని సాక్షాత్తూ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసించారంటే పూరీ ‘పెన్ పవర్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం అదే పూరీ జగన్నాథ్ తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పూరీ సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్‌లా అమ్ముడయ్యేది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం…
