సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.. ‘ప్రేమ్ కుమార్’ కథేంటి? – చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాదర్‌కి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ.. అక్కడొకడు మిగిలిపోతాడు. వాడు పరిస్థితేంటో తెలీదు.. ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని…