ఏప్రిల్ 3, 2026న విడుదలైన ‘ఇచట లవ్ అమ్మబడును కొనబడును’ చిత్రం, నేటి తరం ప్రేమను ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసింది. అంజనీదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధాకర్ మాస్కూరి, శివరాజ్ శంకర్, కృతి ఆర్ భట్, నివిక్ష నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ముందు నుంచే తన బోల్డ్ కాన్సెప్ట్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. కథ విషయానికి వస్తే.. ఇది ఒక చైన్ స్నాచర్ విక్కీ జీవితం చుట్టూ తిరుగుతూ, ప్రేమను వ్యాపారంగా చూసే మనుషుల మధ్య ఇరుక్కున్న ఒక ఫిలిం మేకర్ ఆలోచనలతో కలిసిపోతుంది. ప్రేమను డబ్బుతో కొనే యుగంలో మనం జీవిస్తున్నామా? లేక అది ఇంకా భావోద్వేగాలకు సంబంధించినదేనా? అనే ప్రశ్నలను సినిమా ముందుకు తీసుకొస్తుంది. ఒక క్రిమినల్ లైఫ్‌లో ఉన్న…
