వెంకటేష్ వి.దర్శకత్వంలో సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’. రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత డా. బాల రావి (యు.ఎస్.ఏ) నిర్మించిన ఈ చిత్రం నేడు (16, ఫిబ్రవరి 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇన్నర్ గా యూత్ కి ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ: తల్లిదండ్రుల మాట వింటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు రాంబాబు(సుబ్బు) .అతడికి అమ్మాయిలంటే అస్సలు గిట్టదు. అలాంటి సిద్ధూ… అదే గ్రామానికి చెందిన సీత(శ్రీవల్లి)ని ఒక సందర్భంలో చూసి… ప్రేమలో పడతాడు. అయితే… వీరి ప్రేమను తల్లిదండ్రులు మాత్రం అంగీకరించరు. దాంతో వీరిద్దరూ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఇద్దరూ బైక్…