కొండాపూర్లోని రాజరాజేశ్వరీ నగర్ లొ నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ ఫార్మ్స్ స్టోర్ ను నటి పూజిత పొన్నాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి పూజిత యమ్ ఫార్మ్స్ ఎండీ-పవన్ రెడ్డికి మరియు ఫ్రాంచైజీ ఓనర్ యాస్మిన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ-పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం శుభ్రత చాలా అవసరంగా మారింది. కానీ శుభ్రతతో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. మా స్టోర్ ద్వారా వినియోగదారులకు శుభ్రత మరియు నాణ్యత కలిగిన పండ్లు మరియు కూరగాయలను అందిస్తున్నాము. విజయదశమి నాడు మొదలు పెట్టిన ఏ కార్యక్రమాలైనా విజయాల బాటలొ సాగిపోతాయనే సంకల్పంతో విజయ దశమిరోజు మా స్టోర్‌ను ప్రారంభించడం జరిగింది. అన్ని యమ్ ఫార్మ్ స్టోర్ లు(FOCO) ఫ్రాంఛైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటడ్ మోడల్‌లో యమ్ ఫార్మ్స్ కంపెనీ చేత నడుపబడతాయి.…
Tag: hyderabad
వరద బాధితులకు హీరో రాంకీ రూ. 5 లక్షల విరాళం
హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సాయంగా హీరో -నిర్మాత రాంకీ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు 5 లక్షల విరాళం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందజేశారు.‘సినిమా వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు కేటీఆర్. ‘గంగ పుత్రులు’ లాంటి మంచి చిత్రంలో హీరోగా నటించి నేషనల్ అవార్డు అందుకున్న రాంకీ వరద బాధితుల కోసం తన వంతు సాయం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ఇటీవల జగద్గిరిగుట్టలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాంకీ.
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…
ప్రారంభమైన సత్యదేవ్ ‘తిమ్మరుసు’
‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ కొట్టారు. రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్‌మెంట్ వాలి’ ట్యాగ్‌లైన్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా.. సత్యదేవ్ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా…
హైదరాబాద్‌లో నితిన్ మూవీ షూటింగ్
యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ… “చెక్ టైటిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.” అని తెలిపారు. పోసాని కృష్ణ…