విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమాకు పండుగ అడ్వాంటేజ్, ఏపీ, తెలంగాణలో హౌస్ ఫుల్ అవుతున్న థియేటర్స్

Festival Advantage for Vijay Devarakonda's "Family Star", House Full Theaters in AP, Telangana

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హాలీడే అడ్వాంటేజ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. గత నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఇవాళ ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సులు హౌస్ ఫుల్ అవుతున్నాయి. సెలవు రోజు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఎల్లుండి రంజాన్ హాలీడే ఉండటం కూడా ఈ వీక్ ఫ్యామిలీ స్టార్ కు థియేట్రికల్ కలెక్షన్స్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 5న తేదీన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ డే నుంచే కంప్లీట్…