హీరోయిన్ శ్రీలీలది ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్. ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ భామ కెరీర్ ప్రస్తుతం సందిగ్ధంలోనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా ‘భగవంత్ కేసరి’లో కీలకపాత్ర పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా… ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని వెక్కిరించాయి. గత రెండేళ్ళలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొంది. కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’లో నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సొగసరి ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో శ్రీలీల మెరవనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. దీంతో…
