▪️ అట్లాంటా మహానగరంలో ఘనంగా ఉగాది వేడుక ▪️ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వేదిక ▪️ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొన్న M4M హీరోయిన్ జో శర్మ తెలుగు వారి తొలి పండగ ఉగాది అమెరికాలో ఘనంగా జరిగింది. అట్లాంటాలోని డెన్మార్క్ హైస్కూల్ ప్రాంగణంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శర్మ సెలబ్రిటీ గెస్టుగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ వేదికపై జో శర్మను TAMA అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా M4M (Motive For Murder) మూవీ హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ”ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది…