* ‘ఉప్పెన’ తర్వాత చేసిన ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. విగ్నేష్ శివన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? -‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్…
