* ‘తమిళ వేట్రి కజగమ్’ పేరుతో పార్టీ ప్రకటన * తమిళనాట మరో ప్రాంతీయపార్టీ తమిళనాట మరో సినీహీరో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఏకంగా పార్టీని ప్రకటించి రాకీయాల్లోకి రాబోతున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్ -టీవీపీ’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు విజయ్ వెల్లడిరచారు. ఈ విషయాన్ని హీరో విజయ్ స్వయంగా సోషల్ విూడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘తమిళగ వేట్రి కజగమ్’ పార్టీ నేతలు.. విజయ్‌ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. ‘తమిళగ వేట్రి కజగమ్’ అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం.యితే తాము 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో…
