హీరో సుధీర్ బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఫస్ట్ లుక్ విడుదల

hero Sudheerbabu movie aa ammai gurinchi meeku cheppali firstlook relesed

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా.. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ…కొత్త ఏడాదిలో ఫస్ట్ డే మనమంతా కలవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఉప్పెన సినిమా ద్వారా చెప్పాం. ఆ అమ్మాయి మంచి నటి అని మాకు తెలుసు.…