వరద బాధితుల‌కు హీరో రాంకీ రూ. 5 ల‌క్ష‌ల విరాళం

hero ranky donates 5 lakhs to cm relief fund

హైదరాబాద్‌ వరద బాధితుల‌కు తన వంతు సాయంగా హీరో -నిర్మాత రాంకీ తెలంగాణ సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు 5 ల‌క్ష‌ల‌ విరాళం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందజేశారు.‘సినిమా వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు కేటీఆర్‌. ‘గంగ పుత్రులు’ లాంటి మంచి చిత్రంలో హీరోగా నటించి నేషనల్‌ అవార్డు అందుకున్న రాంకీ వరద బాధితుల‌ కోసం తన వంతు సాయం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వరదల‌ వ‌ల్ల‌ నిరాశ్రయులైన వారికి ఇటీవల‌ జగద్గిరిగుట్టలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాంకీ.