ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్`లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిరదట. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య మధ్య…