హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటివలే తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘హరోం హర’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నేషనల్ వైడ్ గా టీజర్ వైరల్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో వుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. నా జీవితంలో నేను ఏం సాధించినా అది సూపర్ స్టార్ కృష్ణ గారి గిఫ్ట్. ఆయన ఆశీస్సులు నాకు…