రజనీకాంత్… ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ కలుగుతుంది. అయన అభిమానుల్లోనే కాదు.. ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత వాహ్.. రజనీ! అనిపిస్తుంది. అది ఆయన స్టయిల్ కు ఉన్న ఆదరణ. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు రజనీకాంత్. 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయనను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. సినిమాల్లో ఆయన పలికే సంభాషణలు, ప్రత్యేకమైన స్టయిల్ ని క్రియేట్ చేశాయి. దాంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు…