ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గురించిన నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం దర్శకుడు రామ్ గోపాల్…