పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఊహించిన విధంగా మధ్యలో చాలాసార్లు నిలిచిపోయింది. ఈ సినిమా స్క్రిప్టి దశలోనే అనేక రకాల మార్పులతో ఆలస్యం అయింది. ఇక మొత్తానికి హరీష్ శంకర్ చాలా హడావిడిగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్లీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాను కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక పవన్ కేవలం ఇప్పుడు ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అని కూడా కథనాలు రావడంతో ఉస్తాద్ ‘భగత్ సింగ్’ కూడా ఆగిపోతుందేమో అని అనేక రకాల గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని…