యువకులు అమ్మాయిలపై తమ ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేసే పద్ధతులెన్నో.. అందులో పాటలు కూడా ఉంటాయి. అదే అమ్మాయిలు అబ్బాయిలపై తమ ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని పాట రూపంలో వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా! ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహమే లేదు. మన సినిమా హిస్టరీలో ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌లో టాప్‌లో నిలిచి ఓ ఊపు ఊపేశాయి.. ఇప్పటికీ ఆ పాటలను మనం హమ్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటి మరో సాంగ్ ఆడియెన్స్ మనసుని గిలిగింతలు పెట్టడానికి మన ముందుకు వచ్చేసింది. ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ కుర్రకారు మనసుని కవ్వించేస్తుంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా.. ‘గీత సాక్షిగా..’. PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో…