ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘జాతి రత్నాలు’లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ ‘జాతిరత్నాలు’ సినిమాతో మరింత దగ్గరైంది. ఒకే ఒక్క సినిమా ‘జాతి రత్నాలు‘తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘బంగార్రాజు‘ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ! ఇప్పుడు సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా చేయబోతుంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ లో మొదలవుతుంది. ఇంతకు ముందు మేర్లపాక గాంధీ రాసిన ‘ఏక్ మినీ స్టోరీ’ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కి గాంధీ డైరెక్షన్ లో చేయడం ఇదే మొదటిసారి! ‘శ్యామ్…