‘ఇట్లు అమ్మ’కు లభిస్తున్న ఆదరణ అనూహ్యం అపూర్వం!!

Amma Movie Still

-ఇట్లు బొమ్మకు మురళి -బొమ్మకు క్రియేషన్స్ కు బ్రహ్మాండమైన బ్రాండింగ్ -వరుసగా పలు చిత్రాల నిర్మాణం ‘అంకురం’ ఫేమ్ సి.ఉమామహేశ్వరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నటి రేవతి టైటిల్ పాత్రలో ఫారిన్ రిటర్నెడ్ బిజినెస్ మేన్ డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇట్లు అమ్మ’ ఓటిటి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రివార్డులతోపాటు అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. సోనిలివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బొమ్మకు క్రియేషన్స్ పేరు మారుమ్రోగుతోంది. ఈ ఉత్సాహంతో వరుసగా పలు చిత్రాల నిర్మాణం జరుపుతోంది బొమ్మకు క్రియేషన్స్. చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ…”రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్.ఆర్ సంగీతం, గోరేటి వెంకన్న గానం-సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్…