యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ, తదితరాలకు, నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై, తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్ టూరిజం ప్లాజా లో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోసంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ చానెల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 50 మంది సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు. పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, టీవీ చానల్స్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు, కంపెనీ ఆక్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమనిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపుకు అనుసరించాల్సిన…