సాయిరామ్ శంకర్ గతంలో నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. సాయిరామ్ శంకర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించడంలో దిట్ట. తాజాగా యాక్షన్, కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాడో చూద్దాం.. కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)… ఏదైనా ఉపాధి పొందాలని…