Director Sankalp reddy interview : నా కథల్లో భాగంగానే దేశభక్తి అంశం : దర్శకుడు సంకల్ప్ రెడ్డి

Director Sankalp reddy interview

1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనకు తెరరూపం ‘ఐబి 71’ ”తెలుగు చిత్ర ప్రరిశ్రమ కంటే పెద్ద పరిశ్రమ మరొకటి లేదనేది నా అభిప్రాయం” అంటున్నారు జాతీయ అవార్డు గ్రహీత రచయిత, దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తదుపరి ఎలాంటి కథైనా, ఏ భాషలో సినిమా చేసినా హైదరాబాద్ కేంద్రంగానే చేస్తానంటున్నారాయన. అతడి తాజా చిత్రం ‘ఐబి 71’. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటోంది. బాలీవుడ్ కేంద్రంగా హిందీలో వచ్చిన ఈ ‘ఐబి 71’ ఒకరకంగా సంకల్ప్ రెడ్డి గత చిత్రం ‘ఘాజీ’కి అనధికార ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన…