“స్వాతంత్రం మా స్వాతంత్య్రం ” సాంగ్ లాంచ్ చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Director producer Tammareddy Bharadwaja launched the song "Swatantram Maa Swatantram".

తన ఆహార విధానంతో ఆరోగ్య డైట్ స్థాపించి ఆహారం మాది ఆరోగ్యం మీది అనే నినాదంతో కొంతమంది డైటీషియన్స్ మరియు కొంతమంది డాక్టర్స్ ను కలుపుకొని కూరగాయలతో కొన్ని వంటకాలు కనిపెట్టి ఎంతోమందికి దీర్ఘకాలిక వ్యాధిల్ని తగ్గిస్తున్న లక్ష్మణ్ పూడి తను మాతృ సంస్థ ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి గానం చేసినటువంటి స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈరోజు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికం లో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని…