ప్రఖ్యాత సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు.. ఎక్కువగా దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. గ్రామీణ కథాంశాల మీద ఎక్కువ పట్టు ఉన్న దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి. పి.సి.రెడ్డిగా ఎక్కువ పాప్యులర్. రీమేక్ చిత్రాల దర్శకుడుగా ఎక్కువ హిట్స్ ఇచ్చిన వి.మధుసూదనరావు వద్ద శిష్యరికం చేసిన ఈయన రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి గ్రామ మున్సబుగా చేసేవారు. మద్రాసులో బి.ఏ.చదివిన తరువాత చిత్ర రంగంలో సహాయ…