తరచుగా అతడిని వరిస్తుంటాయి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు! అతడు బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బొంగు నరసింగరావు! బి. నరసింగరావుగా విఖ్యాతుడైన అతని నిరుపమాన జీవనయాత్ర తెలిసిన వారికి ఈ పురస్కారాల వెల్లువలు ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించవు. థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెలకొల్పిన సాధికారతకు నిదర్శనం; తనకు లభించిన పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు, అసంఖ్యాక అంతర్జాతీయ అవార్డులు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, తెలంగాణ ప్రజలు, సమ్మోహన పరిచే జానపదుల కళలు, తన మదిలో, ఎదలో, రక్తనాళాల స్పందనలలో నవనవోన్మితంగా చివురులు…