యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం ద్వారా కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ని తెలుగుతెరకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చినబాబు, ఎం, సుబ్బారెడ్ది ల సమర్పణలో కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. ”శీతాకాలం తో నాకు ప్రత్యేకమైన పరిచయం లేకపోయినా.. ఈ శీతాకాలం మాత్రం నాకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా లో హీరో సత్యదేవ్ , తమన్నా, మెఘా ఆకాష్, కావ్యాశెట్టి లు…