క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్బంగా… ఎడిటర్ గ్యారీ బి.హెచ్ మాట్లాడుతూ ‘‘అడివి శేష్‌తో ఇది నాలుగో చిత్రం. అలాగే డైరెక్టర్ శైలేష్‌తో ఇది మూడవ చిత్రం. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. ట్రైలర్ దీనికి మించి బావుంటుంది. సినిమా ఇంకా బావుంటుంది.…