తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్ సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు. సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారో కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన.. అల్లు అర్జున్ ప్రెస్‌విూట్.. తరువాత సినీ స్టార్ల ఇళ్లపై దాడులు ఇటు ఇండస్ట్రీలో, అటు జనంలో కూడా చర్చనీయంగా మారాయి. టికెట్ రేట్లు పెంచేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ఫ2 సినిమాకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు…