‘సలార్’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలని మరింతగా పెంచేస్తూ.. ఈ చిత్రంపై ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ రూమర్ వినిపిస్తుంది. సలార్, క్రేజీఎఫ్కి లింక్ వుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. టీజర్ లో కూడా కొన్ని పోలికలు కనిపించాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ యూనివర్స్ తో ముడిపెడుతూ ‘సలార్’ కథని రాసుకున్నారని వినిపించింది. అయితే ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఇక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్’ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ ట్రైలర్ టైంకి.. కేజీఎఫ్2 క్లైమాక్స్‌కి ఓ సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఒక విషయం…