హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సాయంగా హీరో -నిర్మాత రాంకీ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు 5 లక్షల విరాళం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందజేశారు.‘సినిమా వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు కేటీఆర్. ‘గంగ పుత్రులు’ లాంటి మంచి చిత్రంలో హీరోగా నటించి నేషనల్ అవార్డు అందుకున్న రాంకీ వరద బాధితుల కోసం తన వంతు సాయం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ఇటీవల జగద్గిరిగుట్టలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాంకీ.
Tag: cm relief fund
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…