మన ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ రంగంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓటీటీ ఇప్పుడు ప్రేక్షకులకు చాలా చేరువయ్యాయి. ఈ ఓటీటీ మాధ్యమాల్లో వేగంగా అభివృద్ధి అవుతూ నెంబర్ 1 వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా ఎదుగుతున్న సంస్థ జీ 5. ఇందులో నవంబర్ 25 నుంచి ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ గడా, గౌరి షిండే, రాకేష్ జున్‌జున్‌వాలా, హోప్ ప్రొడక్షన్స్ అనీల్ నాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆర్.బాల్కి దర్శకత్వం వహించారు. సన్నీడియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రీమియర్…