తెలంగాణ ఉద్యమ వీర వనిత చాకలి ఐలమ్మ జీవితం తొలిసారి కూచిపూడి నృత్య రూపకంలో వేదిక పైకి రానున్నది! తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు, కళాతపస్వి, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డా. అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించనున్నారు. ఆధునిక సామాజిక పరిణామానికి, భూపోరాటానికి నాంది పలికిన మహిళ చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని, ఐలమ్మ పాత్రను తానే పోషిస్తున్నట్లు డా. అలేఖ్య పుంజాల తెలిపారు. ఇవాళ అకాల మృతి చెందిన సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఈ నృత్య రూపకాన్ని రచించగా వి. బి.ఎస్.మురళి బృందం సంగీతం అందించారు. తన ఆలోచన అని, తానే…