రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్రమాధిత్య రోల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ ని విడుదల చేయబోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్రభాస్ కి అడ్వాన్స్ హ్యపీ బర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుదల చేయడం విశేషం. ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా…
Tag: Birthday special
రంగ్‌దే.. కీర్తిసురేష్ లుక్ చూశారా..
‘ప్రేమ’తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు సంధర్భంగా ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమై నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్‌కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ’లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్‌లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ…
పవన్ బర్త్‌డే స్పెషల్: ‘ఉప్పెన’ న్యూ పోస్టర్
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఉప్పెన’ చిత్ర బృందం హీరో వైష్ణవ్ తేజ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వైష్ణవ్ తేజ్ చాలా హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. కలర్‌ఫుల్ షర్ట్ ధరించి కాలర్‌ను నోటితో పట్టుకొని, నడుంపై చేయిపెట్టి సూపర్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ను చూస్తున్న ఆనందం ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ బాణీలు…