‘బైకర్’మూవీ రివ్యూ: ఎమోషనల్ రైడ్!

'Biker' Movie Review: An Emotional Ride!

టాలీవుడ్ లో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్.. ఈసారి ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ సన్నిహితులు ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ మూవీగా, తెలుగులో మొట్టమొదటి డాల్బీ విజన్ సినిమాగా ఈ‘బైకర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం… కథలోకి.. విక్కీ అలియాస్ విక్రమ్ నారాయణ్ (శర్వానంద్), తన భార్య అనన్య (మాళవిక నాయర్), తన కొడుకుతో కలిసి ఒక సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తాను గో-కార్టింగ్ రేస్…