‘కాంత’ నుంచి భాగ్యశ్రీ బోర్సే క్లాసిక్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Bhagyashree Borse Classic Birthday Special Poster Released from 'Kantha'

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీ’కాంత’ అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంది. లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేల స్టన్నింగ్ ఫస్ట్ లుక్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు హీరోయిన్ భాగ్యశ్రీ బర్త్డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. భాగ్యశ్రీని క్లాసిక్ లుక్ లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ని కిక్ స్టార్ట్ చేస్తారు. కాంత గొప్ప కథ, నటీనటులు, టెక్నికల్ టీంతో మస్ట్ వాచ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ…