సహాన ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి కమలమ్మ మరియు వెంకటేశప్ప సమర్పణలో రాజు, సహాన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం `బరి`. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచ్ ఈ రోజు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఫిలించాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“ఫస్ట్ లుక్ , టీజర్ , టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. బరి టైటిల్ చాలా ఫవర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న హీరోహీరోయిన్స్ కు, దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా“ అన్నారు. నటుడు నాగమహేష్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో నేను కోడికత్తి శీను పాత్రలో నటించాను. దర్శకుడు…