‘బంగార్రాజు’ మొదటిరోజు వసూళ్ళు 17.5 కోట్లు గ్రాస్ : నాగార్జున అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుదలైన మొదటిరోజునే సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదు చేసుకుంది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకుని శనివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్రకమంలో నాగార్జున, నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ జునైద్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాబివందనం తెలియజేస్తూ ఆరంభించారు. జనవరి 14న…