‘బంగార్రాజు’ పరిస్థితి ఏ విధంగా ఉందంటే…!!

Bangarraju Movie

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించి తాజా మల్టీస్టారర్ చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి పండగకు మనముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్లింది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’కు బాగానే కలిసొచ్చింది. ఇక ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి…